The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ది రాజా సాబ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి రాజా సాబ్ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటి సారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ తర్వాత్తర్వాత మూవీపై అంచనాలు పెరిగాయి.
కాగా రీసెంట్ గా రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందని, తాము అనుకున్న దానికంటే చాలా తక్కువ రేటుకే ఈ డీల్ ను పూర్తి చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూపంలో తక్కువే బిజినెస్ చేసినా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి సక్సెస్ ను అందుకుంటుందని ఆయన చెప్పారు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరి 9న రాజా సాబ్ థియేటర్లలోకి రాబోతుంది.






