Tollywood Releases: డిసెంబర్ వాయిదాల లిస్ట్ పెద్దదే!
ఇండస్ట్రీలో ఒక్క సినిమా రిలీజ్ డేట్ మారడం వల్ల దాని ఎఫెక్ట్ మరెన్నో సినిమాలపై పడుతుందనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పరిస్థితులు చాలా సార్లు ఎదురవగా ఇప్పుడు అఖండ2(Akhanda2) వల్ల మరోసారి కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. కేవలం అఖండ2 వల్ల మాత్రమే కాకుండా డిసెంబర్ లో రిలీజవాల్సిన పలు సినిమాలు వేర్వేరు కారణాలతో వాయిదా పడ్డాయి. అవేంటో చూద్దాం.
డిసెంబర్ 6న రావాల్సిన శర్వానంద్(Sharwanand) బైకర్(Biker) మూవీ నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవగా, డిసెంబర్ 12న రిలీజవాల్సిన ఈషా(Eesha) అనే హార్రర్ సినిమా ఈ నెల 25కి వాయిదా పడింది. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన సైక్ సిద్ధార్థ్(Psych siddarth) అనే సినిమా అఖండ2 తో పోటీ వద్దనుకుని జనవరి 1న రానుండగా, కార్తీ(Karthi) నటించిన అన్నగారు వస్తారు(Anna garu vastharu) సినిమా డిసెంబర్ 12 నుంచి పోస్ట్ పోన్ అయింది. మేకర్స్ ఇంకా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది.
ఇక టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi sesh) హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్(Dacoit) మూవీ ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉండగా అది నెక్ట్స్ ఇయర్ మార్చి 19కి పోస్ట్ పోన్ అయింది. గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో భూమిక(Bhoomika) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యుఫోరియా(Wuphoria) ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా ఫిబ్రవరి 6కి వాయిదా పడింది. డిసెంబర్ 18న రిలీజవాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) కూడా పోస్ట్ పోన్ అయింది కానీ ఇంకా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు.






