Deepika Padukone: దీపికాపై ఆ హీరో ఫ్యాన్స్ విమర్శలు
వర్కింగ్ అవర్స్ విషయంలో ఈ మధ్య చాలా పెద్ద రచ్చే జరిగిన విషయం తెలిసిందే. స్పిరిట్(spirit), కల్కి2(kalki2) సినిమాల నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(deepika padukone) తప్పుకోవడానికి గల మెయిన్ రీజన్ ఇదేనన్న సంగతి కూడా అందరికీ తెలుసు. వర్క్ అవర్స్ విషయంలో అభిప్రాయబేధాలొచ్చి దీపికా ఈ సినిమాల నుంచి తప్పుకుంది. వర్క్ అవర్స్ విషయంలో రాజీ పడేదే లేదని దీపిక ఈ డెసిషన్ తీసుకుంది.
అయితే ఈ విషయాన్ని దీపిక కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్తూ, నా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, తన ఫ్యామిలీ, ఫ్యాన్స్ హెల్ప్, ప్రేమాభిమానాలే తనకు విమర్శలను ఎదుర్కునే శక్తినిచ్చాయని దీపికా తెలపగా, తాజాగా దీపికా వర్కింగ్ అవర్స్ పై మరోసారి మాట్లాడింది. ఎక్కువగా వర్క్ చేయడాన్ని మనమంతా కామన్ గా మార్చేశామని, అధికంగా శ్రమించడమే నిబద్ధత అనుకుంటున్నామని, ఓ మనిషి 8 గంటలకు మించి పని చేయకూడదని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి అవుట్పుట్ ఇవ్వగలమని చెప్పుకొచ్చింది.
ఎక్కువగా వర్క్ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతామని, ఎన్ని గంటలు అధికంగా వర్క్ చేసినా ఉపయోగముండదని దీపికా చెప్పడంతో ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ ఆమెను విమర్శిస్తూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్(shah rukh khan) తో సినిమా చేస్తున్నావు కదా, ఆ సినిమాకు కూడా రోజుకు 8 గంటలే వర్క్ చేస్తున్నావా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.






