అవెంజర్స్ ఫ్యాన్స్ కి పండగే
ది అవెంజర్స్- ఎండ్ గేమ్ విడుదల కోసం అవెంజర్స్ ఫ్యాన్స్ అంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటను ది అవెంజర్స్ -ఎండ్ గేమ్ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్‌లో పొందుపరుస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం. మరీ ముఖ్యంగా ఈ పాటను హైదరాబాద్‌లో ఏప్రిల్ 7 లేదా 8 తేదీల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఏ.ఆర్.రెహమాన్ స్వయంగా ఆవిష్కరించనున్నారు. ది వాల్ట్ డిస్ని కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.













