Chiru-Bobby: చిరూ- మోహన్ లాల్ కలయిక కష్టంలానే ఉందిగా
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా బాబీ కొల్లి(bobby kolli) దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో గతంలో వాల్తేరు వీరయ్య(waltair veerayya) మూవీ రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాపై ఇప్పుడు అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా గురించి గత కొన్నాళ్లుగా ఓ వార్త వినిపిస్తోంది.
చిరూబాబీ2(chiru bobby2) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ నటుడు మోహన్ లాల్(mohan lal) ను తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్, చిరంజీవి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండటంతో ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ కలయిక కుదిరేలా లేదని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు మూవీ బడ్జెట్ ను తగ్గిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే కథలో కొన్ని మార్పులు చేసి, ఆ కథ ఆధారంగా క్యాస్టింగ్ ను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. పైగా మోహన్ లాల్ ఓ సినిమా చేయాలంటే చాలా భారీగానే ఛార్జ్ చేస్తారు. కాబట్టి తగ్గించిన బడ్జెట్ దృష్ట్యా చూస్తే, ఇది కుదిరే పని కాదు. అందుకే ఆ కీలక పాత్రను టాలీవుడ్ లోని స్టార్ తో ఎలాంటి రెమ్యూరేషన్ ఇవ్వకుండా, కేవలం చిరంజీవిపై గౌరవంతో చేసే వారిని ఎంచుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.













