వకీల్ సాబ్2 కు పర్ఫెక్ట్ ఛాయిస్ అదే
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా అంటే పవన్ ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్. కరోనా ఏపీలో టికెట్ రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ ఈ సినిమా సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మొదటి సారి లాయర్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో పవన్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్, తమన్ సంగీతం అన్నీ ఆడియన్స్ కు ఎంతో స్పెషల్.
ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో దిల్ రాజు దీనికి సీక్వెల్ గా వకీల్ సాబ్2 తీస్తారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ దానికి తగ్గ కథ దొరక్కపోవడంతో అది మాటల దగ్గరే ఆగిపోయింది. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సీక్వెల్ కోసం సరిపోయే సినిమా ఒకటి మోహన్‌లాల్ హీరోగా నేరు అనే టైటిల్ తో రిలీజై మలయాళంలో సూపర్ హిట్ దిశగా అడుగులేస్తుంది.
సలార్ పోటీని తట్టుకుని మరీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అయితే వకీల్ సాబ్2 కు సరిగ్గా సరిపోతుందని అందరూ భావిస్తున్నారు. కళ్ళు లేని యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడతాడనేది సినిమా కథ. ఒకవేళ పవన్ ఏదైనా సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. రెమ్యూనరేషన్స్ తప్ప ప్రొడక్షన్ కు కూడా పెద్దగా ఖర్చవదు. మరి ఈ సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తారో చూడాలి.













