తండేల్ రిలీజ్ విషయంలో డేరింగ్ స్టెప్
కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తుందన్న అనౌన్స్మెంట్ తోనే ఆ ప్రాజెక్ట్ కు భారీ హైప్ ఏర్పడుతుంది. డైరెక్టర్-హీరో కాంబో అవొచ్చు, లేదంటే వారు ముందు చేసిన సినిమాలవొచ్చు. రీజన్ ఏదైనా కావొచ్చు కొన్ని సినిమాలకు మాత్రం సెట్స్ పై ఉండగానే మంచి క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం అలాంటి భారీ అంచనాలతో వస్తున్న సినిమా తండేల్.
చందూ మొండేటి, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కార్తికేయ2 సక్సెస్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న చందూ మొండేటి ఈసారి మరింత పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ ఫిషర్ మెన్ గా కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఆడియన్స్ లో మరింత క్రేజ్ ను పెంచింది. దానికి తోడు సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండటం సినిమాకు ప్లస్ అయింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు షూట్ చేసిన కంటెంట్ విషయంలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందట. అందుకే ఈ సినిమా కంటెంట్ పై చాలా నమ్మకం ఉండటంతో తండేల్ ను దసరా బరిలో దించాలని చూస్తున్నారట. దసరాకు ఎన్టీఆర్ దేవర పార్ట్1 ఇప్పటికే షెడ్యూల్ అయి ఉంది. అయినప్పటికీ తమ సినిమాపై ఉన్న నమ్మకంతో తండేల్ టీమ్ కూడా దసరానే టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. సినిమాలో కంటెంట్ బాగుంటే దసరా లాంటి సీజన్ కు రెండు పెద్ద సినిమాలు రిలీజవడం ఏమంత పెద్ద పోటీ కాదు. మరి టీమ్ ఆశల్ని తండేల్ ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.













