Thammudu: తమ్ముడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యూత్ టాలెంట్ నితిన్(Nithin) హీరోగా ఓ మై ఫ్రెండ్(Oh My Friend), ఎంసీఏ(MCA), వకీల్ సాబ్(vakeel saab) డైరెక్టర్ శ్రీరామ్ వేణు(Sri ram Venu) దర్శకత్వంలో వచ్చిన సినిమా తమ్ముడు(Thammudu). దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాతో అయినా నితిన్ మంచి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఇది కూడా బాక్సీఫీస్ వద్ద ఫెయిల్యూర్ గానే నిలిచింది. నితిన్ తమ్ముడుపై ఎన్న ఆశలు పెట్టుకుంటే అవన్నీ నీరు కారిపోయాయి.
ఈ సినిమాతోనే సీనియర్ హీరోయిన్ లయ(Laya) కూడా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తమ్ముడు ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
ఆగస్ట్ 1 నుంచి తమ్ముడు మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానుంది. అజనీష్ లోకనాథ్(Ajaneesh Lokanath) సంగీతం అందించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సప్తమి గౌడ(Sapthami Gowda) కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.






