ఇలా అయితే ఎలా థమన్?
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉన్నదంటే థమన్ పేరే చెప్పాలి. దేవీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంటే, థమన్ మాత్రం సినిమా స్థాయితో సంబంధం లేకుండా వరుసగా ఛాన్సులు కొట్టేస్తున్నాడు. ఇప్పటికే ఓం ఫామ్ లో ఉన్న థమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే అంచనాలు ఏర్పడటం సహజం.
థమన్ ఒక్కోసారి అంచనాలను మించి మ్యూజిక్ ఇస్తే, మరోసారి మాత్రం చాలా నార్మల్ మ్యూజిక్ తో సరిపెట్టేస్తున్నాడు. సినిమా బాగుంటే తన బీజీఎంతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే థమన్, కొన్ని సినిమాలకు అసలు చెప్పుకోదగ్గ రీతిలో మ్యూజిక్ ఇవ్వట్లేదు. సినిమాను బట్టి కాకుండా అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడి మ్యూజిక్ ఇస్తే మరికొన్నేళ్ల పాటూ థమన్ జోరు కొనసాగే ఛాన్సుంది.
ప్రస్తుతం థమన్, రామ్ పోతినేని- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ పెద్దగా క్యాచీగా లేవు. సినిమాలో ఏమైనా వర్కవుట్ అవుతాయేమో చూడాలి. రీరికార్డింగ్ అదిరిపోతుందని స్కంద టీమ్ పదేపదే చెప్తుంది.
అఖండ, వీర సింహారెడ్డి తర్వాత బాలయ్యతో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా నుంచి వచ్చిన గణేష్ సాంగ్‌ను థమన్ చాలా సాదాసీదాగా ట్యూన్ కట్టాడు. ఆ సాంగ్ కు సరైన ట్యూన్ పడితే ప్రతీ సంవత్సరం వినాయక చవితికి పాట మారు మోగిపోయేది కానీ థమన్ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. అఖండ టైమ్‌లో థమన్ చూపించిన ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదు.













