Thaman: తమన్ పోస్ట్ దాని గురించేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమా ఓజి(OG). హరి హర వీరమల్లు(Hairhara Veeramallu) తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజి సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ ఉండగా, పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎక్కడికెళ్లినా ఓజి.. ఓజి అంటూ ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమన్ ఇచ్చిన హింట్ ఫ్యాన్స్ ను చాలా ఎగ్జైట్ చేస్తోంది. తమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ గన్ ఎమోజీ పెట్టి కల్ట్స్ అంటూ పోస్ట్ చేశాడు.
దీంతో తమన్(Thaman) చేసిన పోస్ట్ ఓజి ఫస్ట్ సింగిల్ గురించేనని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఓజి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా సెప్టెంబర్ 25న ఓజీ భారీగా రిలీజ్ కాబోతుంది.







