తమన్ ను కంట్రోల్ చేయాల్సిందే!
గత కొన్నేళ్లుగా తెలుగులో మంచి మాస్ మూవీస్ కు బీజీఎం ఇవ్వాలంటే తన తర్వాతే ఎవరైనా అనే పొజిషన్ కు చేరుకున్నాడు తమన్. మొదట్లో ఈ ప్లేస్ లో దేవీ శ్రీ ప్రసాద్ ఉండేవాడు కానీ గత నాలుగేళ్లుగా దేవీని వెనక్కు నెట్టి మరీ ముందుకు వచ్చాడు తమన్. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తమన్ కు అవకాశాలు మాత్రం తగ్గట్లేదు.
దానికి తోడు మాస్ సినిమా అంటే పూనకాలొచ్చినట్లు రీరికార్డింగ్ ఇస్తాడు తమన్. అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బీజీఎం అప్పట్లో సెన్సేషన్ అయింది. యూఎస్ కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ఆ సౌండ్ కు స్పీకర్స్ పాడవుతున్నాయని సోషల్ మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం తమన్ కు చాలా ప్లస్ అయింది.
ఇప్పుడు తమన్ బోయపాటితో కలిసి మరోసారి స్కంద సినిమాకు వర్క్ చేశాడు. అఖండ రేంజ్ లో సౌండ్ అయితే చేశాడు కానీ ఈసారి మ్యూజిక్ లో ఎమోషన్ మిస్ అయ్యి, ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. దానికి తోడు స్కంద సినిమాలో కంటెంట్ కూడా గొప్పగా లేకపోవడంతో తమన్ సంగీతానికి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు.
పైగా ఇంత సౌండ్ పొల్యూషన్ ను తట్టుకోవడం కష్టమని థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో తమన్ ను ఎవరైనా కంట్రోల్ చేయాలని, లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోలేవని అంటున్నారు. దీంతో తమన్ ఇకనైనా ఫోకస్ పెట్టకపోతే అవకాశాలు తగ్గే ఛాన్సుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.













