తమన్ భలే పట్టుకుంటున్నాడుగా
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా తమన్, దేవీ శ్రీ ప్రసాద్ ఉన్నారు. వీరిద్దరికీ డేట్స్ కుదరకపోతేనే వేరే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రస్తుతం దేవీ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తన దగ్గరకొచ్చిన ప్రతీ సినిమానూ ఒప్పుకోవడం లేదు. దీంతో దేవీ వదులుకున్న అవకాశాలను తమన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
పుష్ప తర్వాత దేవీ చేసిన కమర్షియల్ సినిమా వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ, ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు దేవీనే అనుకున్నారు. కానీ దేవీ చేతిలో ఆరు పెద్ద సినిమాలుండటంతో బాలయ్య సినిమాను వదులుకున్నాడు.
దీంతో ఆ ఛాన్స్ తమన్ ను వరించింది. ఇప్పటికే బాలయ్యతో అఖండ, వీరసింహా రెడ్డి లాంటి సినిమాలకు పని చేసిన తమన్, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మొత్తానికి దేవీ వద్దనుకుంటున్న సినిమాలను తమన్ అందుకుంటూ వరుస సినిమాలతో బాగానే బిజీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవీ చేతిలో పుష్పతో పాటూ ధనుష్ కుబేర, తండేల్, విశాల్ రత్నం, కంగువా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి.













