ఈ నెల 19న సర్కార్ టీజర్
స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో తమిళస్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సర్కార్. ఈ చిత్రంలో విజయ్ సరసన మహానటి ఫ్రేం కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమచారం ప్రకారం, ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. కాగా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 8న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













