బుల్లి తెరపై శ్రీరెడ్డి
తెలుగు చిత్రసీమలో మహిళలపై లైంగిక వేధింపులపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన నటి శ్రీరెడ్డి. వ్యక్తిగత విమర్శల వల్ల ఆ ఉద్యమం పక్కదారి పట్టింది. తర్వాత పరిణామల వల్ల శ్రీరెడ్డి పూర్తిగా హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిపోయారు. ఆ సమయంలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌పై కూడా లైంగిక వేధింపు ఆరోపణలు చేసిందీమె. వాటిపై ఆయన స్పందించి ప్రతిభ ఉంటే తన చిత్రాల్లో అవకాశం ఇస్తానని చెప్పాడు. అన్నట్టుగానే ఆమెకు అవకాశం ఇచ్చినట్టు శ్రీరెడ్డి స్వయంగా ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు కోలీవుడ్ బుల్లితెరపై అలరించబోతుందట. ఆ విషయాన్ని శ్రీరెడ్డే స్వయంగా వెల్లడించింది.













