ఫిల్మ్ ఛాంబర్ వద్ద శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన
టాలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో హల్ చల్ చేసిన నటి శ్రీరెడ్డి. అవకాశాల పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు తనను వాడుకున్నారని, కేవలం తెలుగు అమ్మాయి అనే కారణంతో అవకాశాలు లేకుండా చేశారంటూ, తనకు న్యాయం జరగకపోతే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలియజేస్తా అని ఇటీవల ప్రకటించిన ఆమె అన్నట్టుగానే నేడు నగ్న ప్రదర్శన చేసింది. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ విద్ద వివస్త్రగా మారి నిరసనకు దిగింది. ఇది గమనించిన ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఆమె చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె చర్చలకు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు సమచారం అందించినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి నిరసనతో ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది.













