సాయిపల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సినీ నటి సాయిపల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆవువను తరలించే వారిని కొట్టి చంపే వారికీ కశ్మీర్ ఉగ్రవాదులకు లేదా లేదంటూ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. ఆమె గో రక్షకులను అవమానపర్చారంటూ బజరంగ్దళ్, ఇతర హిందూ సంస్థలకు చెందిన నాయకులు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల 21న విచారణకు హాజరవ్వాలంటూ సాయిపల్లవికి నోటీసులు ఇచ్చారు. దాన్ని సాయిపల్లవి సవాల్ చేస్తూ…హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లలిత ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. వాదోపవాదాలు విన్న ధర్మాసనం సాయిపల్లవి పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ఎదుట హాజరు కావవాల్సిందేనని స్పష్టం చేసింది.













