TGFA: సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే మా ఉద్దేశం.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి

ఘనంగా జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధాన ఉత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులో గద్దర్ ఫిలిం అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. శనివారం(14.06.2025) రోజు జరిగిన ఈ కార్యక్రమంలో గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను అందజేశారు. ఈ వేడుకకు సినీ సెలెబ్రెటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క, మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి, టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు పాల్గొని సినీ ప్రముఖులకు అవార్డులను అందజేశారు. సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, రాజమౌళి, అల్లు అరవింద్, సుకుమార్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు హాజరయ్యారు.హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జూన్ 14న అవార్డ్‌ల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై.. విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి- హీరో అల్లు అర్జున్‌లు హైలైట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా చాలామంది హీరోలకు గద్దర్ అవార్డులను అందజేశారు. ఈ అవార్డులను అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చాలా సేపు మాట్లాడుతూ అనేక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ.. సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే తమ ఉద్దేశం అని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభించడం సంతోషంగా ఉంది. గతంలో నంది అవార్డులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. హాలీవుడ్, బాలీవుడ్ కాదు ప్రపంచ సినిమా తెలంగాణ గడ్డపై ఉండాలంటే ఏం చేయాలో ఏం కావాలో చెప్పండి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని అంటూ హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అయ్యాలా తమ వంత సాయం అందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
2014 నుంచి 2024 వరకు పలు చిత్రాలకు నటీనటులకు దిల్‌రాజు పర్యవేక్షణలో జయసుధ, మురళీ మోహన్‌ల కమిటీలు అవార్డులను ప్రకటించాయి.
మరి ఎవరెవరు ఏ విభాగంలో అవార్డు అందుకున్నారో చూద్దాం
స్పెషల్ అవార్డ్స్
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్ అవార్డు: మణిరత్నం
బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణ చంద్రరావు
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్
ప్రథమ ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ద్వితీయ ఉత్తమ చిత్రం: పొట్టేల్
తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీ
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)
ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేకి అగ్గిరవ్వ మాదిరి..) (హాజరు కాలేదు)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్‌కుమార్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ చారిత్రక చిత్రం: రజాకార్
స్పెషల్ జ్యూరీ: దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ: అనన్య నాగళ్ల (పొట్టేల్)
స్పెషల్ జ్యూరీ: సుజిత్, సందీప్ (క)
స్పెషల్ జ్యూరీ: ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ (రాజు యాదవ్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ : ఫరియా అబ్దుల్లా (మత్తువదలరా)
ఉత్తమ తొలి చిత్రం: యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు)