వార్2లో తారక్ హీరోయిన్ ఫిక్స్
వార్2 సినిమాతో జూ.ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా రానున్న ఈ సినిమాలో తారక్ ను చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టైగర్3 క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన చిన్న హింట్ ఇచ్చి వదిలేసిన విషయం తెలిసిందే.
వార్2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కు నెగిటివ్ టచ్ ఉన్నప్పటికీ హృతిక్ కు ధీటుగా ఈ పాత్రను అయాన్ ముఖర్జీ డిజైన్ చేశాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్లు ముంబై వర్గాల సమాచారం. ఎన్టీఆర్ పక్కన వార్2లో శార్వరి వాఘ్ అనే హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
బంటీ ఔర్ బబ్లీ2 తో తెరంగేట్రం చేసి అదే ఏడాది స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ గా ఐఫా, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత కూడా ఛాన్సులొస్తున్నప్పటికీ ప్రతీదీ ఒప్పుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్న శార్వరికి వార్2 అవకాశం రాగానే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ త్వరలోనే దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, జనవరి నుంచి వార్2 షూటింగ్ లో పాల్గొననున్నాడు.













