Tamannah Bhatia: మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన తమన్నా
తమన్నా(Tamannaah) అందం, టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన తమన్నా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో డేటింగ్ లో ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమన్నా, విజయ్ లవ్ బ్రేకప్ అయిందని వార్తలొస్తున్న నేపథ్యంలో అతన్నుంచి విడిపోయాక తమన్నాకు లక్ కలిసొస్తుందని అంటున్నారు.
ఓదెల2(Odela2) తో తమన్నా ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం తమన్నా ఎంతో కష్టపడిందని, ఓదెల2 తర్వాత మిల్కీ బ్యూటీకి పలు ఆఫర్లు వస్తాయని అందరూ ముందు నుంచే చెప్పుకొస్తున్నారు. సినిమా రిలీజయ్యాక ఓదెల2 చూసిన వాళ్లు తమన్నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.
బాలీవుడ్ మూవీ నో ఎంట్రీకి సీక్వెల్ గా వస్తున్న నో ఎంట్రీ2(No Entry2)లో తమన్నా ఫీమేల్ లీడ్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. నో ఎంట్రీ(No Entry) లాంటి భారీ కాస్టింగ్ ఈ సినిమాలో లేకపోయినా నో ఎంట్రీ2 కూడా గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా చెప్తోంది. తమన్నా కెరీర్ ఇక ముగిసిపోయింది, ఐటెం సాంగ్స్ తప్ప మరే ఆఫర్లు రావనుకుంటున్న టైమ్ లో తమన్నా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకోవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.













