Tamannaah: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అబద్ధం

ఈ మధ్య వర్కింగ్ అవర్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై మూవీ ఇండస్ట్రీలో విపరీతమైన డిస్కషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే ఎంతో మంది తమ తమ ఒపీనియన్స్‌ను షేర్ చేయగా ఇప్పుడు తమన్నా భాటియా(Tamannaah Bhatia) దీనిపై మాట్లాడింది. రీసెంట్ గా జరిగిన ఇండియన్ కౌచర్ వీక్ లో పాల్గొన్న తమన్నా ఈ వ్యాఖ్యలు చేశారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అబద్ధమని, మనం బ్యాలెన్స్ గా ఉంటే ఆ తర్వాత వర్క్, లైఫ్ అన్నీ బ్యాలెన్స్ గానే ఉంటాయని, తాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను నమ్మననని, మనలో ఉండే ఇన్నర్ బ్యాలెన్స్ ను మాత్రమే నమ్ముతానని చాలా నిజాయితీగా చెప్పింది తమన్నా. స్పిరిట్(Spirit) సినిమా కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దీపికా(Deepika Padukone)ను 8 గంటలు వర్క్ చేయమని అడగటం, ఆమె దాన్ని తిరస్కరించడంతో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇండియా కౌచర్ వీక్2025 లో రాహుల్ మిశ్రా(Rahul Mishra) లేటెస్ట్ కలెక్షన్స్ లో రెండు రకాల కోచర్ బట్టల్లో కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది తమన్నా. ఈ రెండు రకాల డిజైనర్ వేర్స్ తమన్నాకు ఎంతో సూటవడంతో పాటూ అవి ఫ్లోరల్ గా ఉండటంతో ఫ్లోరల్ లవర్స్ తమన్నా చూసి తెగ సంతోషిస్తూ ఆమె ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.