అతడితో ఛాన్స్ వస్తే….లిప్ లాక్ చేస్తా
తెలుగు తెరకు శ్రీ సినిమాతో పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో టాప్ స్టార్స్ లో నటించే అవకాశం అందుకుంది. తారక్, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరితో జంట కట్టేసింది. దీంతో అనతికాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఇటీవల విడుదలైన సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్2లో సీనియర్ హీరో వెంకటేష్ తో నటించిన తమన్నా అప్పుడప్పుడు ఐటం సాంగ్స్‌లో కూడా మెరుస్తోంది. అయితే, వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించేదిలేదని తెగేసి చెబుతోంది మిల్కీబ్యూటీ. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతుతులు విధించినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్స్ అనేవి కామన్ అయిపోయాయి.
కానీ, తమ్ము మాత్రం ఆన్ స్క్రీన్ ముద్దు సీన్లకు నో చెబుతోంది. అయితే, లిప్‌లాక్ చేయాల్సి వస్తే ఒక హీరోతో మాత్రం నటిస్తానని చెప్పడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ హీమ్యాన్ హృతిక్ రోషన్. హృతిక్ తో సినిమాలో అవకాశం వస్తే మాత్రం ఆన్ స్క్రీన్ ముద్దులు పెట్టుకోవడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం చెప్పబోనంటోంది. హృతిక్ అంటే తనకు పిచ్చి అభిమానమని, అతడితో నటించే ఛాన్స్ వస్తే చాలాని చెప్పుకొచ్చింది. ఇటీవల అతన్ని దగ్గరి నుంచి చూసినప్పుడు ఈ ముద్దుగుమ్మకు అసలు నోటమాట రాలేదట. చివరకు హృతిక్ దగ్గరికి వెళ్లి నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పి షేక్ హ్వాండ్ ఇచ్చిందట. ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని తమన్నా తెలిపింది.













