మిల్కీ బ్యూటీకి క్రేజీ ఆఫర్
మిల్కీ బ్యూటీ తమన్నా పని ఇక అయిపోయిందనే వార్తలు గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి కొత్త ప్రాజెక్టులు, క్రేజీ సినిమాలకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ భామ. జనవరికి ముందు తమన్నాకు వరుస ఫెయిల్యూర్లు. కానీ ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ సాధించి హిట్ ట్రాక్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామకు క్రేజీ బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్‌లోని అద్భుతమైన నటుల్లో ఒకరైనా నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా తెరకెక్కనున్న బోలే చూడియా సినిమాలో హీరోయిన్గా తమన్నాను తీసుకున్నారట. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ మొదట మౌని రాయ్‌ని ఎంపిక చేశారట. కానీ చివరి నిముషంలో మౌని రాయ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని.. అందుకే ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీకి అవకాశం దక్కిందని సమాచారం. మిల్కీ ఇప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది కానీ ఇంత వరకు బ్రేక్ మాత్రం రాలేదు. మరి ఈ సినిమాతో అయినా బాలీవుడ్లో తమన్నాకు బ్రేక్ లభిస్తుందేమో వేచి చూడాలి.













