ప్రభాస్ సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్?
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి మళ్లీ ఆ స్థాయిలో సినిమా వచ్చింది లేదు. ఆ సినిమాతో క్రేజ్ బాగా పెరిగిపోవడంతో ప్రభాస్ తో సినిమా అంటే అన్నీ హై స్టాండర్డ్స్ లోనే ఉండాలని అనుకుంటున్నారు నిర్మాతలు. అందుకే ప్రభాస్ సినిమాల బడ్జెట్ అంత మొత్తంలో పెరుగుతున్నాయి. సాహో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ చేయడంలో ఎంత టైమ్ తీసుకున్నారన్నది అందరికీ తెలిసిందే.
చివరకు బీజీఎంకు ఒకరు, సాంగ్స్ కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ పని చేయాల్సి వచ్చింది. రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఎంతో లేట్ అయింది. ఆఖరికి జస్టిన్ ప్రభాకరన్‌తో మ్యూజిక్ చేయించుకున్నారు. ఇక కల్కి సినిమా కోసం ముందుగా మిక్కీ జే మేయర్ ను అనుకున్నారు కానీ ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారు.
ఇక అసలు విషయానికొస్తే, ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హను ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ను తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. విశాల్ మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఇప్పటివరకు విశాల్ చేసిన సినిమాలన్నీ చిన్న, మిడ్ రేంజ్ మూవీసే కావడంతో నిర్మాతలు ఏమైనా ఆలోచనను మార్చుకుంటారా లేక హను నిర్ణయానికే ఓటేస్తారా అన్నది చూడాలి.













