Tabu: పూరీ సేతుపతి సినిమాలో విలన్ గా టబు?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన టబు(Tabu) ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. పలు భాషల్లో సినిమాలు చేసిన టబు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితోనే మంచి క్రేజ్ ను అందుకున్నారు. టబు ఆఖరిగా నటించిన తెలుగు చిత్రం అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramulo).
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో టబు నటనకు అందరూ ఎట్రాక్ట్ అయ్యారు. ఆ సినిమా తర్వాత టబు తెలుగులో మరో సినిమా చేసింది లేదు. అయితే ఇప్పుడు టబు మరో తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో టబు నటించనున్నారు.
విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా పూరీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో టబు నటించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో టబు క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పూరీ సేతుపతి సినిమాలో టబు విలన్ గా నటించనున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతనేది పక్కన పెడితే నిజంగా టబు ఈ సినిమాలో విలన్ గా నటిస్తే తర్వాత ఆమెకు మరిన్ని ఛాన్సులు రావడమైతే ఖాయం.