నా సమస్య ఏమిటో వారికి అర్థమైంది : తాప్సీ
చిత్రసీమలో అగ్ర కథానాయకుల సరసన సినిమా ఆఫర్లను వదులుకునే విషయంలో ఎంతో ఆలోచించాల్సి ఉంటుందని చెప్పింది పంజాబీ సొగసరి తాప్సీ. ఓ రకంగా అది ప్రమాదమని వ్యాఖ్యానించింది. సీనియర్ కథానాయిక కరీనాకపూర్ నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొన్న తాప్సీ.. సినిమాల ఎంపికలో నాయికలు కొన్నిసార్లు సందిగ్ధంలో పడతారని, ముఖ్యంగా ఆగ్రహీరోల సినిమాల విషయంలో ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ పెద్ద హీరోల సినిమాల్ని వెంటనే తిరస్కరించలేం. భవిష్యత్తులో మన మాటాల్ని వాళ్లు ఎలా తీసుకుంటారో అనే భయం ఉంటుంది. పాత్ర నచ్చక తిరస్కరించామని కాకుండా తమన సరసన నటిచడం ఇష్టం లేక తప్పుకున్నారని భావించే అవకాశం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం నేను ఆగ్ర హీరోల సినిమాల్ని వదులుకున్నా.. ఆ తర్వాత వారు కలిసినప్పుడు అందుకు గల కారణాల్ని చెప్పాను. నా సమస్య ఏమిటో వారికి అర్థమైంది. ఒకవేళ వాళ్లు నన్ను అపార్థం చేసుకుంటే నేనిచ్చిన వివరణను ఎలా తీసుకునేవారో అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం హీరోలందరూ సినిమాల విషయంలో వాస్తవిక కోణంలో ఆలోచిస్తున్నారు. తమ సినిమాల్లో నటించడానికి ఎవరైనా ఒప్పుకోకపోతే వెంటనే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పింది.













