Saiyaara: వార్2 కంటే ముందే ఆ బ్యానర్ నుంచి మరో సినిమా
యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బాలీవుడ్ లో ఎంత పెద్ద పేరున్న బ్యానర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి బ్యానర్ నుంచి గతేడాది ఒక్క సినిమా కూడా రాకపోవడంతో అందరూ నిరుత్సాహ పడ్డారు. అయితే గతేడాది బాకీని సెటిల్ చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు భారీగా ప్లాన్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వాటిలో ముందుగా వార్2(War2) సినిమా రిలీజవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వార్2 కంటే ముందు యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ఓ సినిమా వస్తుందని తెలుస్తోంది. ఆషికి2(Aashiqui2) డైరెక్టర్ మోహిత్ సూరి(Mohith Suri) దర్శకత్వంలో అహాన్ పాండే(Ahaan Panday), అనీత్ పద్దా(Anith Padda) లీడ్ రోల్స్ లో నటించిన మ్యూజికల్ లవ్ స్టోరీ సయారా(Saiyaara) సినిమాను వార్2 కంటే ముందే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
సయారా తర్వాత హృతిక్ రోషన్(Hrithik Roshan), జూ. ఎన్టీఆర్(Jr NTR) ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కిన వార్2 రానుంది. ఇప్పటికే వార్2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. వార్2 తర్వాత ఆలియా భట్(Alia Bhatt), శార్వరి(Sarvavi) లీడ్ రోల్స్ చేసిన ఆల్ఫా అనే స్పై యాక్షన్ సినిమా రాబోతుంది. ఈ మూడు సినిమాల్లో అన్నింటికంటే వార్2 పై భారీ అంచనాలున్నాయి.






