Swayambhu: స్వయంభు షూటింగ్ అప్డేట్

కార్తికేయ2(Karthikeya2) సినిమాతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) ఆ క్రేజ్ ను అలానే నిలుపుకోవాలని ఎంత ట్రై చేసినప్పటికీ అది కుదరలేదు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభు(Swayambhu) పైనే ఉన్నాయి. కార్తికేయ2 తర్వాత నిఖిల్ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఫ్లాపవడంతో ఎలాగైనా తర్వాతి సినిమాతో హిట్ అందుకోవాలని చాలా కసిగా ఉన్నాడు నిఖిల్.
అందులో భాగంగానే నిఖిల్ స్వయంభు కోసం చాలా కష్టపడుతున్నాడు. పీరియాడికల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నిఖిల్ పోరాటయోధుడిగా కనిపించనున్నాడు. దాని కోసం నిఖిల్ 8 నెలల పాటూ ఎంతో కఠినమైన ఆహార నియమాలతో పాటూ మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఒక్క రోజు మినహా స్వయంభు షూటింగ్ మొత్తం పూర్తైందని టాక్. రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) డేట్ దొరగ్గానే ఆ ఒక్క రోజు షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారట. అయితే స్వయంభు షూటింగ్ పూర్తైనా ఈ సినిమాకు సీజీ ఎక్కువగా అవసరమవడంతో రిలీజ్ కు మరికాస్త టైమ్ పడుతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు.