స్వయంభు గురించి లీక్ చేసిన నభా
కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమా తర్వాత నిఖిల్ సినిమాల బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. కార్తికేయ2 తర్వాత నిఖిల్ స్పై అనే సినిమా తీశాడు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. స్పై తర్వాత నిఖిల్ కొంచెం గ్యాప్ తీసుకుని ఇంట్రెస్టింగ్ సినిమాలను ఓకే చేశాడు. అందులో ఒకటి ది ఇండియన్ హౌస్ కాగా, మరొకటి స్వయంభు అనే పీరియాడికల్ హిస్టారికల్ సినిమా. స్వయంభు కోసం నిఖిల్ గుర్రపు స్వారీ, యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. ఫుల్ బాడీ పెంచి స్ట్రాంగ్ పర్సన్ లా మారి మేకోవర్ చేశాడు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గురించి నభా నటేష్ ఓ ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చింది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నభా కెరీర్లోనే భారీ సినిమా కానుంది. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ ఫ్రాంచైజ్ గా తెరకెక్కుతున్నట్లు నభా తెలిపింది. స్వయంభు రెండు మూడు భాగాలుగా రానుందని అమ్మడు వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.













