స్వాగ్ బిజినెస్ డీల్ అదిరిందిగా
సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం అతని చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. లో బడ్జెట్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు శ్రీవిష్ణు. రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకు బడ్జెట్ ఉంటే శ్రీవిష్ణుతో సినిమా చేయొచ్చు. మంచి కథ ఉన్న సినిమాలను చేస్తూ లాభాలు తెస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడు.
ఇదిలా ఉంటే శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వాగ్ సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను హసిత్ గోలి తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళ, కన్నడ థియేట్రికల్ రైట్స్ రూ.9 కోట్ల మొత్తానికి డీల్ లాక్ అయినట్లు సమాచారం. రీసెంట్ టైమ్స్ లో శ్రీవిష్ణు సినిమాలకు జరిగిన బిజినెస్ డీల్స్ లో ఇదే బెస్ట్ డీల్. ఇంకా చెప్పాలంటే నిర్మాతలు స్వాగ్ ను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి లాభాలొచ్చే ఛాన్సుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు వయసు మళ్లిన వాడిగా కనిపించనున్నాడు. మరి స్వాగ్ శ్రీవిష్ణుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













