సెన్సార్ లో సువర్ణ సుందరి
పూర్ణ, సాక్షిచౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్ఎస్ఎస్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ సువర్ణసుందరి విఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వర్క్ జరిగింది. ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే గ్రాండ్‌గా ఆడియోను విడుదల చేయనున్నాము. పబ్లిసిటీపరంగా కూడా విభిన్నమైన ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నాము. మే 31న సినిమా విడుదల చేయనున్నామన్నారు. నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ సువర్ణసుందరి చిత్రం సెన్సార్‌కు సిద్దమయింది. తెలుగు ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేయనున్నాము. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.













