సువర్ణ సుందరి ప్రీరిలీజ్ వేడుక
జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, ఇంద్ర, రామ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం సువర్ణ సుందరి. ఎమ్.ఎస్.ఎన్.సూర్య దర్శకుడు. ఎం.ఎల్.లక్ష్మి నిర్మాత. సాయికార్తిక్ స్వరకర్త. 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదల ముందుస్తు వేడుకను నిర్వహించారు. ఇంద్ర మాట్లాడుతూ ప్రకృతి శక్తుల నేపథ్యంలో సాగే చిత్రమిదన్నారు. నా కెరీర్లోనే గొప్ప చిత్రమిదని చెప్పింది సాక్షి చౌదరి. పూర్ణ మాట్లాడుతూ జయప్రద వంటి నటితో నటించే అవకాశం రావడం నా అదృష్టం అంది. దర్శకుడు సూర్య మాట్లాడుతూ ఆరు వందల సంవత్సరాల కిందట ఓ రాజు చేసిన పొరపాటు వల్ల మూడు తరాల ప్రజలు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే కథకి తెర రూపమిది. విజువల్ ఎఫెక్స్ కి పెద్ద పీట వేశాం. సాంకేతిక నిపుణులంతా కలసి చేసిన మనోహర సృష్టి ఈ చిత్రం. జయపద్ర నటన ప్రధానాకర్షణ అన్నారు.













