ఇండియన్-2 విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఇండియన్ మూవీకి నాలుగేళ్ల కిందటే సీక్వెల్ గా దీన్ని మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల సినిమాను పూర్తి చేయడంలో చాలా ఆలస్యం జరిగింది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది.
రిలీజ్ గురించి తాజాగా చిత్ర బృందం అధికారికంగా జూన్ లో రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. అయితే రిలీజ్ విషయంలో ఇన్నాళ్లు ఫ్యాన్స్ ను ఊరించి ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ చెప్పకపోవడంపై కమల్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు మిగిలిన భాషల్లో ఇతర సినిమాల డేట్స్ కూడా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.
అలాంటప్పుడు రిలీజ్ డేట్ ను వీలైనంత ముందుగా ఫిక్స్ చేయాలి. జస్ట్ జూన్ లో రిలీజ్ అని అనౌన్స్ చేస్తే మిగిలిన సినిమాల ప్లానింగ్ కు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే డేట్ ఖరారు చేయకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. మరోవైపు టీమ్ మాత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యాకే డేట్ ను అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయిందట. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













