‘అకాశం నీ హద్దురా’ ఫస్ట్ లుక్
2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జె.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: షాలినీ ఉషాదేవి, సుధా కొంగర, సినిమాటోగ్రఫీ: శ్రీనికిత్ బొమిరెడ్డి, ఎడిటర్: సతీష్ సూర్య, ఆర్ట్ డైరెక్టర్ :జాకీ.













