అండమాన్ తర్వాత నెక్ట్స్ ఎక్కడ సూర్య?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సూర్య చాలా సైలెంట్ గా మొదటి షెడ్యూల్ ను అండమాన్ నికోబార్ దీవుల్లో మొదలుపెట్టాడు. అక్కడ సూర్య, పూజా హెగ్డేపై మెయిన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
జులై మొదటి వారానికి ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత సూర్య44 సెకండ్ షెడ్యూల్ కోసం టీమ్ ఊటీ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ చాలా పెద్దదట. నెల రోజుల పాటూ చిత్ర యూనిట్ అక్కడే షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ షెడ్యూల్ లో హీరో సూర్యతో పాటూ, విలన్ టీమ్ పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కంగువ పూర్తవగానే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మొదలుపెట్టాడు సూర్య. దీనికి ముందు సూర్య ఎన్నో కథలు విన్నప్పటికీ ఆఖరికి కార్తీక్ సుబ్బరాజ్ కథకే ప్రాధాన్యతనిచ్చి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న కార్తీక్ సుబ్బరాజ్, సూర్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడతాడో చూడాలి.













