సెన్సిబుల్ అంశాన్ని టచ్ చేస్తున్న సూర్య
సిల్వర్ స్క్రీన్ పై సూర్య చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఒదిగిపోయే సూర్య రీసెంట్ గా తన 43వ సినిమాను సుధ కొంగరతో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఏ జానర్ లో రాబోతుంది? అన్నది మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. దీని గురించి తాజాగా కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది.
1967 తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో సూర్య కాలేజ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ లో నటించనున్నాడని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం సూర్య స్పెషల్ గా సన్నద్ధం కానున్నట్లు సమాచారం. యువ సినిమాలో ఇప్పటికే స్టూడెంట్ లీడర్ గా నటించిన సూర్య, మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్నాడు.
ఇలాంటి పాత్రలు సూర్య ఎంత గొప్పగా చేస్తాడో పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆ క్యారెక్టర్ ఇంకా బలంగా పండటానికి ఛాన్సుంది. మొత్తానికి సూర్య, సుధ కలిసి ఓ సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













