సూపర్ స్టార్ పిలుపును నిరాకరించిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) నటించిన కంగువ(kanguva) సినిమా పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగువ టీమ్ దేశం మొత్తం తిరుగుతుంది. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఈవెంట్ లో 30 అడుగుల కటౌట్‌ను కూడా ప్రదర్శించారు.
కంగువతో నార్త్ లో భారీగా మార్కెట్ ను పెంచుకోవాలని సూర్య ఎంతో కసిగా ఉన్నాడు. ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(ram charan) లాగే అక్కడ తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఈవెంట్ తర్వాత కంగువ టీమ్ ప్రమోషన్స్ కోసం ముంబైకు తిరిగి వచ్చి మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో హిందీ నటుడు బాబీ డియోల్(bobby deol) సూర్యను సూపర్ స్టార్(super Star) అని అభినందించగా, సూర్య ఆ పిలుపును వెంటనే నిరాకరించి తన ఒదిగి ఉండే స్వభావాన్ని మరోసారి స్టేజ్ పై ఆవిష్కరించడం అందరి మనసుల్ని గెలుచుకుంది. అంతేకాదు, తమకు సూపర్ స్టార్ అంటే ఎప్పుడూ రజనీ(rajinikanth) సారే, ఆయనే ఒకే ఒక్క సూపర్ స్టార్ అని, ఒక వ్యక్తి నుంచి పేరును ఎప్పుడూ తొలగించలేరని, అది మరో వ్యక్తికి బ్యాడ్జ్ కాకూడదని సూర్య వ్యాఖ్యానించాడు. రజినీపై సూర్యకు ఉన్న గౌరవం అందరినీ మెప్పించింది.













