సూర్య40.. మామూలుగా ఉండదట!
కెరీర్ స్టార్టింగ్ నుంచే విలక్షణమైన, విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న సూర్య కొత్తదనం కోసం తెగ తాపత్రయ పడుతుంటాడు. ఆయనలా తాపత్రయ పడటం వల్లే ఆడియన్స్ ఆకాశం నీ హద్దురా సినిమా చూడగలిగారు. ఆ సినిమా ఆశించని రీతిలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సూర్య కెరీర్ లోనే తను చేసిన ఉత్తమ ప్రయోగంగా ప్రశంసలందుకుంది ఆ సినిమా.
అదే సూర్య, ఇప్పుడు పాండిరాజ్ డైరక్షన్ లో అలాంటి మరో పాత్రను చేయనున్నాడు. సూర్యకు ఇది 40వ సినిమా. దీంతో స్టోరీ, స్కీన్ ప్లే, లుక్స్ విషయంలో సూర్య చాలా కేర్ తీసుకుంటున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఖడ్గం పట్టుకుని సూర్య నడుస్తున్న వైనం చూస్తుంటే స్టోరీ బ్యాక్ డ్రాప్ చాలా డిఫరెంట్ ఉండనుందనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమా సూర్య కెరీర్ లోనే సంథింగ్ స్పెషల్ మూవీగా నిలవనుందని అందరూ చెప్పుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే టాక్ కోలీవుడ్ లో చాలా గట్టిగా వినిపిస్తుంది. తన లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ ఈ సినిమాలో పూర్తి భిన్నంగా ఉంటాయంటున్నారు. వైవిధ్యభరిత సినిమాలు తెరకెక్కించే డైరక్టర్ గా పాండిరాజ్ కు కోలీవుడ్ లో చాలా మంచి పేరుండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.













