వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి
బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా.. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్దరి కథతోనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దేవినేని అనే టైటిల్‌ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. బెజవాడ సింహం అనేది ఉపశీర్షిక. శివనాగు దర్శకత్వంలో ఆర్టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా, వంగవీటి రంగా పాత్రలో ప్రముఖ పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు. వంగవీటి రంగా 72వ జయంతి సందర్భంగా రంగా పాత్రధారి ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.













