వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో !
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బయోపిక్స్‌లో యాత్ర ఒకటి. మహి వి.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన దర్శకుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని మురళి, షర్మిల పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరోక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అభిమానులకి షాకింగ్‌గా మారింది. వైఎస్.జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నారట. సూర్యకు, జగన్‌కు మధ్య ఉన్న అనుబంధం కారణంగానే సూర్య యాత్ర చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం.













