లాక్ డౌన్ తో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ లుక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో తన ఫామిలీ తో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా తన డిఫరెంట్ లుక్ ని ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. మహేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో సెన్సషనల్ హిట్ అందుకున్నాడు. మహేష్ లో మాస్ లుక్స్ కంటే కూడా క్యూట్ లవర్ బాయ్ లుక్స్ ఎక్కువగా ఉంటాయి. మాస్ హీరోగా మెప్పించినా… అతని పేస్ లో మాత్రం ఎక్కువగా క్యూట్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి పూరి దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రంలో మాస్ ఇమేజ్ సంపాదించినా.. ఆయన మాస్ లో క్లాస్ గా ఉంటుంది.
ఇక లాక్ డౌన్ సందర్భంగా ఫ్యామిలీ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. అంతే కాదు వరుసగా మహేష్ బాబు తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెద్ద కళ్ళజోడు, ఫుల్ షేవ్, లాంగ్ హెయిర్ తో చాలా క్యూట్ గా ఉన్నాడు. అంతే కాదు ఇప్పటి వరకు మహేష్ బాబు ఎప్పుడూ షర్ట్ లేకుండా కనిపించలేదు..
తాజాగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు స్విమ్మింగ్ ఫూల్ లో షర్ట్ లేకుండా ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. ఈ న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తున్నాయి. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు…పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం లో మహేష్ లవర్ బాయ్ గా కనిపిస్తాడు అనే ప్రచారం జరుగుతుంది. అందుకేనేమో 44 ఏళ్ళ మహేష్ ఈ పోస్టులుల ద్వారా 25 ఏళ్ళ కుర్రాడి లుక్స్ తో అభిమానులను ప్రిపేర్ చేస్తున్నాడు.













