Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా తన రెండో మూవీతో రాబోతున్నారు. ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర (Subhas Chandra) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్‌ని రేలంగి, వేల్పూరి, భీమవరంలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో షూట్ చేశారు.
ఈ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ బిగ్ స్క్రీన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ తీసుకువస్తుంది.
ఈ చిత్రంతో నిధి ప్రదీప్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని, నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి.













