Sujeeth: ఓజి ఓ ట్రయల్ బాల్ మాత్రమే

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి(OG) సినిమా సెప్టెంబర్ 25న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఓజి రిలీజైన అన్ని ఏరియాలతో పాటూ యూఎస్ లో కూడా ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. మూవీ రిలీజైన తక్కువ కాలంలోనే ఓజి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు లాభాల్లోకి ఎంటరైంది.
ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఓజి కలెక్షన్లు 6 మిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నాయి. ఓజి మూవీకి యూఎస్ లో వచ్చిన ఆదరణను గుర్తించి మేకర్స్, ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా మూవీ డైరెక్టర్ సుజిత్(sujeeth), మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) అమెరికాలోని డల్లాస్ కు వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూడటమే కాకుండా మూవీ స్క్రీనింగ్ తర్వాత ఫ్యాన్స్ తో సంభాషించారు.
అమెరికాలో సుజిత్, తమన్ ను పవన్ ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్‌కమ్ చేశారు. అమెరికాలో పవన్ ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి తాను చాలా థ్రిల్ అయ్యానని చెప్పిన సుజిత్, మూవీ రిలీజైన నెక్ట్స్ డే పవన్ తనకు ఇచ్చిన హగ్ ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ఓజి పార్ట్1 కేవలం ట్రయల్ బాల్ అని, నెక్ట్స్ పార్ట్ మరింత భారీగా గ్రాండ్ గా ఉండబోతుందని కూడా సుజిత్ వెల్లడించాడు.