SSMB29: అందరి కళ్లూ ఎస్ఎస్ఎంబీ29 పైనే
కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ తో క్రేజ్ ను తెచ్చుకుంటే, మరికొన్ని సినిమాలు కాంబినేషన్ల వల్ల క్రేజ్ ను సొంతం చేసుకుంటాయి. ఇంకొన్ని అయితే అనౌన్స్ కూడా కాకుండానే విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Super star mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) ఈ కోవలోకే వస్తుంది.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి దర్శకుడిగా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29. మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అనౌన్స్ చేసి సెట్స్ పైకి వెళ్లే రాజమౌళి, ఈ సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ కు తీసుకెళ్లి అందరికీ షాకిచ్చారు. మొన్నామధ్య ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి యావత్ దేశాన్నే షేక్ చేసింది ఎస్ఎస్ఎంబీ29 టీమ్.
కాగా ఈ మూవీ నుంచి నవంబర్ లో ఓ సాలిడ్ అప్డేట్ ఇస్తామని మేకర్స్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నవంబర్ నెల రావడంతో అందరి ఫోకస్ ఎస్ఎస్ఎంబీ29 పైనే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి, ఎలాంటి సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడో చూడాలి.







