SSMB29: మూడు నిమిషాల వీడియోతో జక్కన్న సర్ప్రైజ్
నవంబర్ వచ్చేసింది. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఓ పెద్ద అప్డేట్ కోసం ఎదురు చూస్తుంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29(SSMB29). ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది రూపొందుతుంది.
రాజమౌళి గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎస్ఎస్ఎంబీ29 తెరకెక్కుతుంది. మామూలుగా తన సినిమాలను ముందుగానే అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లే రాజమౌళి ఈ సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా సైలెంట్ గా పూజా కార్యక్రమాలను ముగించి సెట్స్ పైకి తీసుకెళ్లి ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డే సందర్భంగా ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ గ్లోబ్ ట్రాటర్(Globe trotter) అనే హింట్ ఇచ్చి నవంబర్ లో పెద్ద అప్డేట్ ఇస్తానని జక్కన్న ఊరించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎస్ఎస్ఎంబీ29 నుంచి వచ్చే సర్ప్రైజ్ మీదనే ఉంది.
అయితే ఇచ్చిన మాట ప్రకారమే రాజమౌళి ఈ సినిమా టైటిల్ తో పాటూ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఈ ఈవెంట్ కు సుమారు లక్ష మంది హాజరయ్యేలా జక్కన్న ప్రణాళికలు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ భారీ ఈవెంట్ లో 3 నిమిషాల కంటెంట్ తో టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి జక్కన్న(Jakkanna) ప్లాన్ చేస్తుండగా, ఎస్ఎస్ఎంబీ29కు వారణాసి(Varanasi) అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది చూడాలి. ఒకవేళ జక్కన్న 3 నిమిషాల వీడియోను రిలీజ్ చేయడం నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్ ఇన్నాళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్టే అవుతుంది.







