మహేష్ రాజమౌళి మూవీ రిలీజ్ అప్పుడేనా?
దర్శకధీరుడు రాజమౌళి, తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై తన టీమ్ తో కలిసి విజయేంద్ర ప్రసాద్ కసరత్తులు చేస్తున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చినట్లు సమాచారం. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ అడ్వెంబచర్ ట్రావెలర్ గా కనిపిస్తాడని, స్టోరీ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని రాజమౌళి ఇప్పటికే చెప్పాడు.
భారీ బడ్జెట్‌తో కెఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని రాజమౌళి చెప్పడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను రాజమౌళి వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే మొదలు పెట్టనున్నాడట.
యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ ను నిర్వహించనున్నారని, క్యాస్టింగ్ సెలక్షన్స్, లొకేషన్ సెర్చింగ్స్ కూడా ఏడాది మొదట్లోనే చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసి, 2025లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అంతా బానే ఉంది కానీ రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడమే తన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు పూర్తవుతుందో ఆయనక్కూడా తెలియదు. అలాంటిది సెట్స్ పైకి వెళ్లకుండా మహేష్ తో చేయబోయే సినిమా 2025లో రిలీజ్ అవుతుందంటే ఏ మాత్రం నమ్మశక్యం కావట్లేదు.













