రికార్డు స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు?
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అక్టోబర్ 5న పునః ప్రారంభమైంది. ఈ నెల 22న ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఆరోజు రామ్ చరణ్ వాయిస్‌తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది. బాహుబలి-2 తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం). పీరియాడిక్యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. సుమారు 80శాతం షూటింగ్ పూర్తికాగా.. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటీనటులు ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవ్‌సన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన వ్యాపార లావాదేవీలు కూడా ప్రారంభించేసారు.
ఇటీవల డిజిటల్ ఫార్మాట్ కి సంభందించిన రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థకు, మరియు స్టార్ టీవీ కి శాటిలైట్ హక్కులు ఇచ్చారని తెలుస్తోంది. యావత్ భారతీయ భాషల్లో టెలికాస్ట్ చేయడానికి షుమారు 200 కోట్లకు డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను విక్రయించినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో విడుదల అయినా తరువాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోడానికి, ఛానల్ లో టెలికాస్ట్ చేయడానికి ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా మన తెలుగువారి సినిమా ఇంత పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడం ఇదే తొలిసారి. తెలుగు సినీ పరిశ్రమ గర్వించే విషయం.













