Rajamouli: ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రశంసల వర్షం
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి ఎన్టీఆర్(NTR) అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనే విషయం తెలిసిందే. తాను ఎంతో మంది హీరోలతో పని చేసినా తనకు ఇష్టమైన, కంఫర్ట్ అయిన హీరో అంటే ఫస్ట్ తారకే అని ఎన్నో సార్లు చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు మరో సారి ఎన్టీఆర్ ను రాజమౌళి అదే రేంజ్ లో పొగిడాడు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీముడో(Komuram Bheemudo) సాంగ్ గురించి రాజమౌళి(Rajamouli) మాట్లాడాడు.
ఆ పాటను షూట్ చేయడం అంత తేలికైందంటే దానికి కారణం ఎన్టీఆరే అని, ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టరో అందరికీ తెలుసని, కానీ ఆ సాంగ్ లో తన శరీరంలోని ప్రతీ అణువూ పలికించి పాటను మరింత రక్తి కట్టించాడని, ఎన్టీఆర్ ఉండబట్టే ఆ సాంగ్ ను షూటింగ్ చేయడం తనకు చాలా సులభమైందని రాజమౌళి ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
ఎన్టీఆర్ తో పాటూ కొరియోగ్రఫర్ ను కూడా మెచ్చుకోవాలని, సాంగ్ లో ఎన్టీఆర్ ను ఎలా కొట్టాలి? ఎలా వేలాడదీయాలనే దానిపై ఎంతో స్టడీ చేసి ఆ సాంగ్ ను కొరియోగ్రఫీ చేశాడని చెప్పాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్(RRr:Behind and beyond) అనే డాక్యుమెంటరీ జపాన్ లో రిలీజవుతున్న సందర్భంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొన్న జక్కన్న ఈ విషయాన్ని అక్కడి మీడియాతో షేర్ చేసుకున్నాడు.













