దేవర భార్యగా శృతి
ఆర్ఆర్ఆర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా మీద ఆడియన్స్ కు ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.
తారక్ తో జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఈ కీలక షెడ్యూల్ లో ఓ సాంగ్ ను కూడా తెరకెక్కించనున్నారట. ఇప్పటికే గోవా షూటింగ్ నుంచి కొన్ని సీన్స్ కూడా లీకై, నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న విషయం ఇప్పటికే లీకుల ద్వారా బయటికొచ్చింది.
బాహుబలి తరహాలో తండ్రీ కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ సినిమా లో పెద్ద దేవరకు భార్యగా మరాఠి నటి శృతి మరాఠె నటిస్తోంది. ఈ విషయాన్ని శృతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శృతికి ఆ పాత్ర ద్వారా నటనకు చాలా స్కోప్ దొరికిందని అంటున్నారు. ఇప్పటికే తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయిన శృతికి దేవర టాలీవుడ్ డెబ్యూ కానుంది. కొరటాల వెతికి మరీ ఆమెను తీసుకొచ్చాడంటే ఏదో గట్టి కంటెంటే ఉండుంటుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.













