రవితేజ మళ్లీ ఆ తప్పు చేస్తాడా?
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల కెరీర్ లో వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా లాంటి భారీ హిట్లున్నాయి. కానీ ఆగడు నుంచి వైట్లకు డిజాస్టర్లు వెంటాడుతున్నాయి. బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ లుగా మిగిలాయి. దీంతో ఆ తర్వాత శ్రీను వైట్లకు తర్వాతి సినిమా స్టార్ట్ చేయడానికి నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది.
అతి కష్టం మీద గోపీచంద్ హీరోగా ఒక సినిమా ఓకే చేయించుకుని గతేడాది షూటింగ్ స్టార్ట్ చేశాడు వైట్ల. కానీ ఆ తర్వాత సినిమాకు బడ్జెట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నిర్మాతలు కూడా మారినట్లు వార్తలొచ్చాయి. అసలు గోపీతో వైట్ల చేస్తున్న సినిమా రిలీజవుతుందా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీను వైట్ల వెంకీ సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు
గతేడాది వెంకీ సినిమా రీ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనను వెంకీ సీక్వెల్ చేయమని చాలా మంది అడుగుతున్నారని, తాను కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వెంకీ2కు స్క్రిప్ట్ రెడీ చేయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వైట్ల అయితే వెంకీ2 చేస్తానంటున్నాడు కానీ ఇప్పుడు తనున్న పరిస్థితులకు అది సాధ్యమా అన్నది అసలు ప్రశ్న. వైట్ల లైమ్ లేట్ లో లేనప్పుడు ఫ్యాన్స్ ఎంత వద్దన్నా వినకుండా తనతో అమర్ అక్బర్ ఆంటోనీ చేసి బాగా నష్టపోయిన రవితేజ, ఇప్పుడు మరోసారి శ్రీను వైట్లకు ఛాన్స్ ఇస్తాడా అన్నది అనుమానమే.













