బెల్లంబాబుతో ఒకప్పటి స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల, దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. ఆనందం మూవీతో శ్రీను వైట్ల చిత్ర పరిశ్రమకు ఎంటరై, ఆ తర్వత కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీలతోనే ఎక్కువగా సక్సెస్ లు అందుకున్నాడు.
కోన వెంకట్, గోపీ మోహన్ లాంటి రచయితలో సినిమాలు తెరకెక్కించిన శ్రీను వైట్ల ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడనే చెప్పాలి. రవితేజ, మహేష్, తారక్‌లకు కమర్షియల్ సక్సెస్‌లు అందించిన శ్రీనువైట్ల, తన అన్ని సినిమాలు ఒకే విధంగా ఉండేలానే చూసుకున్నాడు. ఓ కమెడియన్‌ను పెట్టి, అతన్ని చివరకు హీరోతో బకారా చేయించి నవ్వులు పూయించి హిట్ కొట్టాడు.
కానీ చివరకు అదే ఫార్ములా శ్రీను వైట్లని డిజాస్టర్ డైరెక్టర్ ని చేసింది. మహేష్ బాబుతో చేసిన ఆగడు డిజాస్టర్‌గా మిగలగా, చరణ్‌తో చేసిన బ్రూస్లీ కూడా అదే ఫలితాన్నిచ్చింది. వరుణ్ తేజ్‌తో చేసిన మిస్టర్, రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఈయనకు ఎవరూ ఛాన్స్ లు ఇవ్వరు అనుకునే టైమ్ లో ఢీ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. కానీ ఏమైందో ఏంటో ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఇదిలా ఉంటే శ్రీను వైట్ల ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చే ఛాన్సుందంటున్నారు. కెకె రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రియదర్శిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి తర్వాత చేయబోయే సినిమా ఇదేనని టాక్.













